సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సర్వే మొదలైంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కీలక నగరాలకు ర్యాంకులను ప్రకటిస్తూ వస్తున్నది. 2015 నుంచి 2023 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో హైదరాబాద్ మెరుగైన ర్యాంకింగ్ సాధించింది. గతేడాది సిటీ 9వర్యాంకు, భారతదేశంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌కు అవార్డు దక్కింది.
దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్-2024పై సర్వే ప్రారంభించింది. ఇప్పటి వరకు 2వేల మంది పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నగర పౌరులకు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛతపై అభిప్రాయాలను తీసుకునేందుకు 10 ప్రశ్నలతో కూడిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా సీటిజన్ ఫీడ్ బ్యాక్ లింకును పంపించి, క్యూఆర్ కోడ్, ఆ తర్వాత సంబంధిత పౌరులకు ప్రశ్నలు వేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించనున్నది. ఏప్రిల్‌లో ర్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించనుంది.