Shilparamam | కొండాపూర్, ఏప్రిల్ 17 : మాదాపూర్లోని శిల్పారామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్.. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవు దినాలను పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే ఈ క్యాంపు ద్వారా మట్టికుండల తయారు చేయడం (పాటరి), పెన్సిల్ స్కెచ్, మధుబనీ పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, అక్రలిక్ పెయింటింగ్, సిషెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాలు, సంస్కృతంలో మాట్లాడడం వంటి అంశాలలో నామమాత్రం రుసుముతో, వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి గల వారందరూ పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 8886652030, 8886652004 నెంబర్ల ద్వారా సంప్రదించాల్సిందిగా తెలిపారు.