హైదరాబాద్ : అక్క పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బాగ్ అంబర్పేట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరవింద్, సంధ్య అనే దంపతుకు కూతురు, కొడుకు శరత్ కుమార్(23) ఉన్నారు. రెండేళ్ల క్రితం అప్పు చేసి కూతురు పెళ్లి చేయగా, పూర్తిగా మద్యానికి బానిసైన అరవింద్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న శరత్ కుమార్ తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం చూసి తట్టుకోలేక, అప్పు తీర్చే మార్గం లేక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. శరత్ కుమార్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.