నేడు సుధీర్‌బాబు ఉద్యోగ విరమణ
పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించి, ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంక్‌లో ప్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్‌బాబు గురువారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.
- ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం : సుధీర్‌బాబు
సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించి, ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంక్‌లో ప్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్‌బాబు గురువారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ గ్రౌండ్లో ఉద్యోగ విరమణ మహోత్సవం నిర్వహించగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని సిబ్బంది కఠోర శ్రమతోనే గతంలో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్, నేడు ప్యూచర్సిటీగా అవతరించిన కొత్త కమిషనరేట్లు రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచాయన్నారు. కాగా 2001వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా సుధీర్‌బాబు తన ప్రస్తానంలో మహిళల భద్రత, సైబర్‌క్రైమ్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వాహణలో కీలక మార్పులు తీసుకొచ్చారు.
2012లో ఇండియన్ పోలీస్ మెడల్, 2025లో అతి ఉత్కృష్ట సేవా పతకం ఆయనకు లభించాయి. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికీ సహజమని, అయితే ప్రజలకు అందించే సేవలే చిరస్తాయిగా నిలుస్తాయని సుధీర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ చందనాదీప్తి, బెటాలియన్ కమాండెంట్ జమీల్ భాషా, కమిషనరేట్ డీసీపీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

