ప్రభుత్వ హాస్టళ్లను తక్షణమే సంస్కరించాలి.. నల్గొండ అంజి డిమాండ్
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా తయారవుతోందని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా తయారవుతోందని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో పరిస్థితులకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.
గురుకులాలు, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనల కారణంగా ఇప్పటికే ముగ్గురు చనిపోయారని, మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి, విద్య రంగాన్ని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

