దుండిగల్,డిసెంబర్22: దుండిగల్‌లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం-2025 సోమవారం ప్రారంభమైంది. కేంద్ర యువజన,క్రీడల మంత్రిత్వశాఖ,జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి,మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొనడం విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు.
కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో తమ కళాశాల విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారన్నారు. తమ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తున్నామని,అందులో భాగంగానే మేడ్చల్ జిల్లాలోని శ్రీరంగపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న తమ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఉదయ్రంజన్గౌడ్, రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల వైస్ చైర్మన్ మర్రి ధీరేన్రెడ్డి, ప్రిన్సిపాల్ డా.కే. శ్రీనివాసరావు, డా.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.