సిటీ బ్యూరో/కొండాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కన్నెర్ర చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడం సబబేనంటూ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను శనివారం రాత్రి దహనం చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా హెచ్‌సీయూ పరిధిలోని ఒక్క ఎకరం భూమిని కూడా అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. భూముల వేలం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.