ఖైరతాబాద్, మే 11 : సోమాజిగూడలోని ఓ హోటల్లో ఆదివారం నల్గొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్‌కు చెందిన 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా సాగింది. సుమారు 55 ఏండ్ల తర్వాత కలుసుకున్న వారంతా.. ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్నప్పటి రోజులు, గురువులు, వారి బోధనలను గుర్తు చేసుకున్నారు.
అప్పటి చదువులకు ఇప్పటికీ చాలా తేడా ఉన్నదని, నాడు గురువులను గౌరవించుకునేవారంటూ విశ్రాంత పోస్టల్ ఉద్యోగి వెంకన్న గుర్తు చేశారు. నాటి గురువులు నేర్పిన చదువు, సంస్కారం వల్లే తాను ఉన్నత స్థానాలకు చేరకున్నానని మరో పూర్వ విద్యార్ధి వినోద్ అన్నారు. ఏ సెక్షన్ నుంచి జీ సెక్షన్ వరకు సుమారు 400 మంది విద్యార్థులుండే వారని, ప్రస్తుతం 81 మంది మాత్రమే వచ్చారంటూ వ్యాపారి మంచుకొండ ప్రకాశం అన్నారు.