మేడ్చల్,ఫిబ్రవరి13: రెసిడెన్సియల్ కళాశాలలో విద్యార్థిని హాస్టల్గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం….. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన నిమ్మల రాముల కూతురు రమాదేవి (17) నగరంలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది.
సోమవారం ఫ్రీ పైనల్ పరీక్షలు ఉండడంతో పరీక్ష రాస్తున్న రమాదేవి మాస్ కాపింగ్ చేస్తుండగా ఇన్విలేజటర్ చూసి విద్యార్థినిని మందలించడంతో మనస్తాపం చెందిన రమాదేవి మధ్యాహ్నం లంచ్ సమయంలో హాస్టల్ గదిలోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది వెంటనే చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు.సంంఘటనా స్థలానికి చేరుకున్న పలు విద్యార్థి సంఘాల ప్రతినిధు లు యజమాన్యం ఒత్తిడి భరించలేకనే మనస్తాపం చెంది రమాదేవి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ హాస్టల్ ఎదుట బైఠాయించారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.