బండ్లగూడ, సెప్టెంబర్ 19: కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కిస్మత్‌పూర నివాసి రోహిత్ యాదవ్ (21) డిగ్రీ విద్యార్థి. అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కళాశాలకు బయలు దేరాడు.
కిస్మత్పూర్ ఎస్బీఐ బ్యాక్ వద్ద ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.