చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య
ల్యాప్‌టాప్ దొంగిలించాడనే ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శేరిలింగంపల్లి, మే 19: ల్యాప్‌టాప్ దొంగిలించాడనే ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లా బరీషాకు చెందిన మయాంక్ కుందు (23) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఐ ఎకనామిక్స్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తూ వర్సిటీలోని ఎఫ్ హాస్టల్ రూమ్ నంబర్ 242లో ఎంఏ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ విద్యార్థి సుపత్రి లోహతో కలిసి ఉంటున్నాడు. రీడింగ్ రూమ్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను చోరీ చేశారని ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న యూనివర్సిటీ యాజమాన్యానికి మయాంక్‌పై ఫిర్యాదు చేశారు.
ల్యాప్ టాప్‌లు తీసి ఉంటే తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్‌టాప్‌ల విష యం తనకు తెలియదని చెప్పాడు. ల్యాప్‌టాప్‌లను ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మయాంక్ సోమవారం హాస్ట ల్ నుంచి వెళ్లి వర్సిటీలోని బఫెల్లో లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే ఆ విద్యార్థులు మయాంక్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం మయాంక్ మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించా రు. కాగా డ్రగ్స్‌కు బానిస అవడంతోనే మయా ంక్ పలుమార్లు ల్యాప్ టాప్‌లు తస్కరించాడని అతని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

