మెహిదీపట్నం : హోటల్లోకి చొరబడి దాడులకు పాల్పడ్డ వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్హుస్సేన్ నాంపల్లి పోలీసులకు సూచించారు.మంగళవారం తెల్లవారుజామున రెడ్‌హిల్స్‌లోని సితార హోటల్‌పై కొంతమంది యువకులు దాడిచేసి పారిపోయిన సంఘటనపై ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషాను కలిసి మాట్లాడిన ఎమ్మెల్యే సంఘటనపై ఆరా తీశారు. సంఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.