గడువు ముగిసింది సీజ్ మిగిలింది
ఆస్తి పన్ను బకాయి దారులపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కోసం ఇప్పటికే ఓ టీఎస్‌ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినప్పటికీ బకాయిలను చెల్లించని వ్యాపార వాణిజ్య సముదాయాలకు తాళం వేసి..
- చందానగర్ సర్కిల్లో ఆస్తి పన్ను బకాయిదారులపై కఠిన చర్యలు
మియాపూర్, మార్చి 15: ఆస్తి పన్ను బకాయి దారులపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కోసం ఇప్పటికే ఓ టీఎస్‌ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినప్పటికీ బకాయిలను చెల్లించని వ్యాపార వాణిజ్య సముదాయాలకు తాళం వేసి.. సీజ్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్లో 75 మంది పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి పడ్డారు .ఇప్పటికే వారికి నోటీసులను జారీ చేశారు. నోటీసు గడువు సైతం తాజాగా ముగిసింది.
ప్రభుత్వం ఓ టీ ఎస్ ను కల్పించినప్పటికీ ఇంకా బకాయిదారుల్లో చలనం రాకపోతుండడంతో సీచ్ మంత్రాన్ని అమలు చేసేందుకు సిదమవుతున్నారు రూ.5 లక్షలకు పైగా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారు చందానగర్ సర్కిల్ పరిధిలో సుమారు 75 వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పన్ను బకాయిలను చెల్లించాలని ఇప్పటికే వారికి నోటీసులను జారీ చేశారు. ప్రభుత్వం ఓ టీ ఎస్ సైతం ప్రకటించిందని వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ బకాయి దారులలో స్పందన రాకపోతుండడంతో, సోమవారం నుంచి సదరు వ్యాపార కేంద్రాలను సీజ్ చేయాలని నిర్ణయించారు .ఇప్పటికే ఈ తరహా పన్ను బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు.
ఇప్పటికే మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 24 లక్షలకు గాని వాణిజ్య భవనం పన్ను బకాయి ఉండడంతో నెల కిందట సదురు భవనానికి అధికారులు తాళం వేశారు. పన్నులు చెల్లించకపోవడంతో ఇప్పటివరకు తాళం కొనసాగుతోంది. ఓటీఎస్‌ను ప్రకటించడంతో సదురు బకాయిదారు తన ఆస్తి పన్ను బకాయిని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇదే తరహాలో మొండి బకాయిదారుల వ్యాపార వాణిజ్య కేంద్రాలను సీజ్ చేయడం ద్వారా తగిన గుణపాఠం నేర్పేందుకు చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు రంగం సిద్ధం చేశారు. అవసరమైతే ఆస్తులను జప్తు చేసి తమ పన్ను బకాయిలను వసూలు చేసుకునేందుకు వెనకాడబోమని అధికారులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

