కొండాపూర్/దుండిగల్ : చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర నుంచి పీజేఆర్ స్టేడియం వెళ్లే దారిలోని స్ట్రీట్ వెండర్స్ డబ్బాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. తమ బతుకులను రోడ్డు పాలు చేశారంటూ..
సదరు వీధి వ్యాపారులు న్యాయం చేయాలంటూ మియాపూర్ సరిల్ ఉప కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే డీ.పోచంపల్లిలోని సర్వేనంబర్ 168లో మూడు భవనాలతో పాటు గాగిళ్లాపూర్‌లో ఓ ప్రహరీని టౌన్‌ప్లానింగ్ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు.