ఆ వీధులకు కొత్త సొబగులు
సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్‌కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ జోన్లో విశాలమైన పరిశుభ్రమైన రహదారుల నిర్మాణాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో..
- విదేశాలను తలపించేలా సుందరీకరణ..
- ఆకట్టుకునే బొమ్మలు..అందమైన కుర్చీలు
- శేరిలింగంపల్లి జోన్లో 24 ప్రాంతాల్లో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటుకు కసరత్తు
మియాపూర్, జనవరి 6: సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్‌కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ జోన్లో విశాలమైన పరిశుభ్రమైన రహదారుల నిర్మాణాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. స్ట్రీట్ ఫర్నిచర్ తరహాలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా 24 ప్రాంతాలను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అధికారులు ..అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపు..పనుల ప్రారంభంపై దృష్టిని సారించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్‌గూడ, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో 24 ప్రాంతాలను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. చందానగర్ సర్కిల్ పరిధి శేరిలింగంపల్లి సర్కిల్ , యూసుఫ్‌గూడ సర్కిల్స్‌ను స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి ఎంపిక చేశారు. ప్రధానంగా కూడళ్లు, వీధుల గోడలపై అందమైన చిత్రాలు, చక్కని లాన్ల ఏర్పాటు, కాఫీ బేలు, పచ్చదనం, చిన్నారులు ఆడుకునేలా ఆట పరికరాలు , అందమైన వీధి దీపాలు, ఫౌంటెయిన్లు, తదితర బొమ్మలు ఏర్పాటు చేస్తారు. ఐటీ జోన్‌లోని పలు ప్రాంతాలను విదేశాలను తలపించేలా రూపొందించాలన్నది తమ లక్ష్యమని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VB G Ram G Scheme | సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి.. ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్తో 3.73 లక్షల మంది కూలీలు మాయం
Government Lands | సర్కార్‌కు భూములే దిక్కా.. ఆస్తులు అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయమా?
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
Volunteer Jobs | నిరుద్యోగులకు మరో ధోకా.. లక్ష మంది వలంటీర్ల నియామకానికి రేవంత్ సర్కార్ ప్లాన్!
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

