అంబర్‌పేట ( హైదరాబాద్) : నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు. మంగళవారం స్థానికుల ఫిర్యాదు మేరకు అంబర్ పేట(Amberpeta) సీపీఎల్ రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద డ్రైనేజీ సమస్య పై స్పందించి, సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్లు, వీధిలైట్లు, తాగునీటి సమస్యపై అధికారులు తక్షణమై స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రామకృష్ణ, డీజీఎం విష్ణువర్ధన్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పేర్రాజు, మేనేజర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం అమావాస్య సందర్భంగా ప్రేమ్‌నగర్ గ్రీన్ ల్యాండ్ వద్ద ప్రేమ్‌నగర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బర్కత్‌పుర ఇంపీరియల్ క్యాస్టెల్ రెసిడెంట్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.