బంజారాహిల్స్,డిసెంబర్ 13: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్‌నగర్ ప్రాంతం లో సుమారు ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి వారి ఇండ్లను జీవో 118 కింద క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
రహ్మత్‌నగర్‌లోని నిమ్స్‌మే, పోలీస్‌లైన్స్ తదితర సంస్థలకు చెందిన ఖాళీ స్థలంలో సుమారు 50ఏండ్లుగా ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న పేదలకు జీవో 58, జీవో 59 కింద క్రమబద్ధీకరణకు అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. సుమారు 4వేలకు పైగా ఇండ్లకు ప్రయోజనం కలిగించేందుకు జీవో 118 కింద అవకాశం కల్పించాలని కోరారు.