సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) ; నగర సిగలో మరో మణిహారం చేరనున్నది. హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనున్న ఇందిరాపార్కు- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.450 కోట్లతో 2.6 కిలోమీటర్లు నిర్మించిన అతిపెద్ద ఉక్కువంతెన పనులు ఇటీవల పూర్తికావడంతో లోడ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం వచ్చే పది రోజుల్లోగా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెన వాడుకలోకి వస్తే ఎన్టీఆర్ జంక్షన్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
46 ఫౌండేషన్లు..1 2, 500 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడకం
స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవి
ప్రాజెక్టు స్వరూపం : రూ. 450 కోట్లు
పొడవు : 2.62 కి.మీ
వెడల్పు : నాలుగు లేన్లు
స్టీల్ పిల్లర్లు : 81
ఉక్కు గిడ్డర్లు : 426
కాంక్రీట్ వాడకం : 20వేల క్యూబిక్ మీటర్లు