ఖైరతాబాద్, డిసెంబర్ 19 : రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వివేక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజాభవన్ వద్ద స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంలకు వినతి ప్రతాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు త్రివేణి, మమత, సౌజన్య, నరేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.