మణికొండ ఫిబ్రవరి 3( నమస్తే తెలంగాణ): మణికొండ (Manikonda)మున్సిపాలిటీలో ‘బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ (Ball badminton )పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్మెంటిన్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ సంతోష్, మణికొండ మునిసిపాలిటీ డివిజనల్ ఇంజనీర్ శివ సాయిలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు.
విజేతలు వీరే..
మొదటి స్థానం ఏ.ఎస్.రావు నగర్‌కు చెందిన మారుతి, రెండో స్థానం బీహెచ్ఈఎల్ సంకల్ప, హనుమకొండ టీం మూడో స్థానంలో నిలిచామి. కాగా, స్థానిక మణికొండ టీం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సాయి చరణ్ ఎన్నికయ్యాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సహయ కార్యదర్శి కమల్, జర్మెంటన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జావేద్ జార్ ఖాన్, స్థానిక మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్, అసోసియేషన్ ముఖ్య సలహాదారు అందె లక్ష్మణ్ రావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు హరిహరనాథ్ రెడ్డి, నరహరి శాస్త్రి, సీతారామరాజు, రమేష్, రామిరెడ్డి, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..