Monalisa | మహా కుంభ మేళా (Maha Kumbh Mela)లో వైరల్ అయిన మూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోస్లే (Monalisa) బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హిందీ సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’తో తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నటించేందుకు మోనాలిసా నుంచి రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా సంతకం కూడా తీసుకున్నారు. చిత్రీకరణ సైతం ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో తన సినీ ప్రయాణంపై మోనాలిసా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
థియేటర్ బయట అల్లు అర్జున్ పుష్ప-2 పోస్టర్ (Pushpa 2 Poster) పక్కన నిలబడిన ఫొటోను మోనాలిసా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ బయట నిలబడ్డానని, త్వరలోనే పోస్టర్లో కనిపిస్తానంటూ తెలిపింది. ‘ఈ రోజు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం. అల్లు అర్జున్ పుష్ప-2’ అంటూ’ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है
जल्दी ही मुंबई में मिलेंगेअल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp
— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025
కుంభమేళాలో మోనాలిసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur) చిత్రంలో మోనాలిసాకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా ప్రకటించారు. గత వారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ఉంటున్న మోనాలిసాను, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె సంతకం చేసింది. చిత్రీకరణ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఇతర వివరాలను ఇరువురూ వెల్లడించలేదు. చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు (Amit Rao) నటిస్తున్నట్లు టాక్.
Also Read..
“మోనాలిసాకు బాలీవుడ్ చాన్స్”
“Mahakumbh | మహాకుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయికి బాలీవుడ్ బంపరాఫర్!”
“Monalisa | బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం.. తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా”