భోపాల్: మహా కుంభ మేళాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే (16) బాలీవుడ్ చాన్స్ దక్కించుకుంది. హిందీ సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’తో ఆమె తెరంగేట్రం చేయనుంది.
రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ఉంటున్న మోనాలిసాను, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె సంతకం చేసింది. చిత్రీకరణ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఇతర వివరాలను ఇరువురూ వెల్లడించలేదు.