సిటీబ్యూరో, అక్టోబరు 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలులో చార్జీల పెంపునకు ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రకుమార్, తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీకి సలహాలు ఇవ్వాలనుకునే ప్రయాణికులు నవంబర్ 15లోగా ffchmrl@gmail.comకు మెయిల్, లేదా చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైల్ భవన్, బేగంపేట, సికింద్రాబాద్-500003 చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలని సూచించారు.