Nursery Mela | సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటడం అంటే రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి తుమ్మల 15వ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ మేళాలో రకరకాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రదర్శిస్తారన్నారు. నర్సరీ మేళా ఇన్చార్జి ఖాలిద్ అహ్మద్ మాట్లాడుతూ ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని
వెల్లడించారు.