జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదాయం పెంపు లక్ష్యంగా జీహెచ్ఎంసీ కార్యకలాపాలను జీఐఎస్ పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులు.. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నియో జియో ఇన్ఫో టెక్నాలజీస్ ప్రై.లి సంస్థకు అప్పగించగా, 18 నెలల పాటు సర్వే బాధ్యతల అప్పగింతకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలుపనున్నారు. రహదారుల విస్తరణ, వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ అదనపు వ్యయం రూ.139 కోట్లు, భూ సేకరణ, గోపన్‌పల్లిలో జంతువులకు దవాఖాన అంశాలపై చర్చించనున్నారు. 11 అంశాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు.