ఖైరతాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెట్టడం హర్షణీయమని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు చారి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్లు నిధులు కేటాయించాలని, రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలను అందించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణాచారి, ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, కోశాధికారి శ్రీనివాస్ చారి, మహిళా అధ్యక్షురాలు భార్గవి పాల్గొన్నారు.