మార్మోగిన రామ నామస్మరణ..
సీతారాములవారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి తరించిపోయా రు.
- ఉప్పల్ నియోజకవర్గంలో వైభవంగా సీతారాముల కల్యాణం.. హాజరైన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు
ఉప్పల్జోన్ బృందం, మార్చి 30 : సీతారాములవారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి తరించిపోయా రు. గురువారం ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలు, ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాల్లో వేదపండితుల మం త్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ రాములవారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యా యి. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉప్పల్ గణేశ్‌నగర్‌లోని ఆలయం, హబ్సిగూడ కాకతీయన గర్‌లోని మహంకాళి రామాలయంలో జరిగిన వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ గాయం శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హబ్సిగూడ స్ట్రీట్ నం.8లోని రామాలయంలో వేడుకలు నిర్వహించారు.
చిలుకానగర్‌లోని ఆలయాల్లో జరిగిన ఉత్సవాలకు కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పాల్గొని పూజలు చేశారు. కాప్రాలో, ఓల్డ్కాప్రాలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వా మి ఆలయం, ఆదిత్యనగర్కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, సాయి బాబానగర్ కాలనీ, కాప్రా చెరువు సమీపంలోని రామాలయంలో కల్యాణా న్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపానకం పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిత్యనగర్ కాలనీలో జరిగిన కల్యాణం, అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం లో కేసీసీ ప్రతినిధి సంజీవరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మల్లాపూర్, మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్లలోని ఆలయాల్లో కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కల్యాణంలో పాల్గొన్నారు. హెచ్‌బీకాలనీ ఫస్ట్ ఫేస్ మైదానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్‌తో కలిసి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

