కల్యాణం..వైభోగం
శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, ఏడు మున్సిపాలిటీ, మూడు కార్పోరేషన్లలో ఆలయాలు, వీధుల్లో రాముల వారి కల్యాణాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు.
- ఊరూరా ఘనంగా రాములవారి కల్యాణం
- పలు చోట్ల అన్నదానం,శోభాయాత్రలు
- ఆలయాల్లో భక్తుల పూజలు
- పలు చోట్ల పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్,మార్చి 30: శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, ఏడు మున్సిపాలిటీ, మూడు కార్పోరేషన్లలో ఆలయాలు, వీధుల్లో రాముల వారి కల్యాణాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శాస్ర్తోయుక్తంగా రాములవారితో సీతమ్మ తల్లికి వివాహం జరిపించారు. ఈ కల్యాణోత్సవంలో భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామ నామ జపం మార్మోగింది. ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదానం, శోభయాత్రలను నిర్వహించారు.పానకం, పండ్లు పంపిణీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లక్ష్మీనగర్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, నాగారం, ఘట్కేసర్, పోచారం, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో మంత్రి మల్లారెడ్డి రాముల వారిక కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.
- శ్రీరామ నవమి సందర్భంగా మార్వాడీ యువమం చ్ మేడ్చల్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.
- నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని తదితర ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సంలో మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత, వైస్ చైర్మన్లు మల్లేశ్‌యాదవ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
- ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటీలో మంత్రి మ ల్లారెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పావనీ జంగయ్య యాద వ్,పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి,పోచారం,ఘట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు,భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయంత్రం భక్తులు,యువకులు శోభాయాత్రను నిర్వహించారు.
- మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
- ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడలో సర్పంచ్ రమాదేవి రాములుగౌడ్ ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.కొర్రెముల కమ్యునిటీ హాలులో జరిగిన వేడుకల్లో ఆ గ్రామ సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ దంపతులు,ఘనపూర్‌లో సర్పం చ్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మమత మహేశ్‌గౌడ్ దంపతులు, పీసీసీ అధికార ప్రతినిధి హరివర్థన్ రెడ్డి, అవుషాపూర్‌లో సర్పంచ్ కావేరి మశ్చేందర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.
- జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ప్రజలు భక్తిశ్రద్ధలతో రామాలయాల్లో వైభవంగా రాముల వారి పెండ్లి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
- ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని పోతాయిపల్లిలో శ్రీరామభద్ర క్షేత్రం, దేవరయాంజాల్ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, ఆలియాబాద్ శ్రీరామాలయం, లక్ష్మాపూర్ శ్రీరామ పాదక్షేత్రం, శామీర్‌పేటలోని వీరన్నగుప్తా, శివాలయం, తూంకుంట శివాలయం, మూడుచింతలపల్లి, ఉద్దెమర్రి, కేశవరం తదితర గ్రామాల్లో శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవరయాంజాల్ శ్రీసీతరామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా నమస్తే తెలంగాణ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ సీహెచ్.శ్రీనివాస్, సర్యూలేషన్ జీఎం రాంరెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కీసరలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవ వేడుకల్లోసర్పంచ్ మాధురి వెంకటేశ్ దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా కీసరగుట్ట ఆలయంలో శ్రీ సీతారామస్వామి కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ రమేశ్‌శర్మ దంపతులు పాల్గొన్నారు.
- బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని 5వ డివిజన్ పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీ శివాంజనేయ ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణంలో మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ పద్మారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

