సుందరాంగుడు రామయ్య.. ముగ్ధ మోహనురాలు సీతమ్మ.. వధూవరులు కాగా.. ఆకాశమంత పందిరి.. భూలోకమంత మండపం.. చుట్టూ లక్షలాది మంది జనం.. కోలాట నృత్యాల విన్యాసాలు.. మార్మోగుతున్న పెండ్లి మంత్రాలు.. ప్రతిధ్వనిస్తున్న మంగళవాద్యాలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ ముహూర్తాన భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి..
అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు.. ముత్యాల తలంబ్రాలు ఇద్దరి మీదుగా రాలి పడుతున్న వేళ భద్రాద్రి పులకించింది.. గోదావరి తీరం పావనమైంది.. మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది.. రాములోరి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను సమర్పించారు.
Hyd7