సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగా ణ): ఇటీవల జరిగిన జేఈఈ మె యిన్ పరీక్షల్లో నగరంలోని శ్రీచైతన్య విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.
300కు 300మార్కులు సాధించి, ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇం డియా ఫస్ట్ ర్యాంక్‌ను వంగ అజయ్‌రెడ్డి సొంతం చేసుకోగా ఆలిండియా టాప్ 100లో 10ర్యాంకులు, ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా టాప్ 500లోపు 31ర్యాంకులు సాధించినట్లు శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ వెల్లడించారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆల్ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను శ్రీచైతన్య విద్యార్థులే సొంత చేసుకుంటున్నట్లు తెలిపారు.