వాహనాల తనిఖీలు..
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- పట్టుబడ్డ నగదు, బంగారు ఆభరణాలు
వెంగళరావునగర్, మార్చి 10: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పి.వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. ఎస్ఆర్నగర్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా..
హఫీజ్‌పేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న మహేంద్రకుమార్ (38) అనే వ్యాపారి ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా.. ఆ వాహనంలో రూ.5.80 లక్షల నగదు, రూ. 3,86,640 విలువజేసే 64.440 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,12,245ల విలువజేసే 1420.83 గ్రాముల వెండి ఆభరణాలను గుర్తించారు. నగదు, ఆభరణాలను గురించి ప్రశ్నించగా.. అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదు. దీంతో పోలీసులు నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

