పెంపుడు జంతువులకు ప్రేమను పంచాలి
పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలని ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ పేర్కొన్నారు.
- సినీ నటుడు శరత్‌కుమార్
అమీర్‌పేట్, మార్చి 21: పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలని ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన హెర్మయో డంకన్ రెడ్డి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ మాట్లాడుతూ… పెంపుడు జంతువులతో మమేకమవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడగలమన్నారు. హెచ్డీఆర్ఎఫ్ సంస్థ త్వరలోనే నగరంలో పెంపుడు జంతువుల కోసం పూర్తి స్థాయి మల్టీ స్పెషాలిటీ, డయాగ్నస్టిక్స్ సెంటర్లను నెలకొల్పనుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడిని అభినందించారు. రేబిస్ నివారణకు సంబంధించి పెంపుడు జంతువులతో పాటు వీధి కుక్కలకు కూడా మైక్రో చిప్‌లు ఇంజెక్ట్ చేయడం వంటి కార్యక్రమాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హెచ్డీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 24న నెక్లెస్ రోడ్డులోని పెట్స్ పార్కులో పెంపుడు జంతువులతో పాటు, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఆర్ఎఫ్ బోర్డు మెంబర్లు అర్చన, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- actor Sarathkumar
- dogs
- pets
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

