మేడ్చల్, ఆగస్టు8(నమస్తే తెలంగాణ): క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలకు పరికరాలను త్వరలోనే అందజేయనుంది. గ్రామీణ, నగరంలో ఉండే క్రీడకారుల సౌకర్యం కోసం ప్రభుత్వం క్రీడ ప్రాంగణలను ఏర్పాటు చేసిన విషయం విధితమే.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 130 క్రీడ ప్రాంగణాలు ఉండగా, గ్రామీణ ప్రాంతంలో 59, మున్సిపాలిటీల పరిధిలో 71 క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.2 లక్షల విలువ గల క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేయనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు క్రీడా ప్రాంగణాలను పర్యవేక్షించే వారికి క్రీడా పరికరాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.