కొండాపూర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విచ్చేసి డివిజన్ మహిళలను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వారిని అన్ని రంగాలలో రాణించేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
శేరిలింగంపల్లిలో… మహిళల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ సుజాత యాదవ్‌తో కలిసి గోపినగర్, నెహ్రూనగర్‌లలో పర్యటించి మహిళలను ఘనంగా సన్మానించారు.
చందానగర్‌లో… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాలలో సమ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందరిచే శభాష్ అనిపించుకుంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ పరిధిలోని శానిటేషన్ మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించి చీరలను పంపిణీ చేశారు.