హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోడ్లపై వదిలివెళ్లే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి రోడ్లపై వదిలి వెళ్లిన వాహనాలను క్రేన్ల సహాయంతో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలపై బాధిత యజమానులు 15 రోజుల్లోగా స్పందించకపోతే వేలం వేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
రాబోయే కొద్దిరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. రోడ్లపై వదిలివెళ్లిన వాహనాలను సంబంధిత యజమానులు తక్షణమే అక్కడ్నుంచి తీసుకెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ రంగనాథ్ సూచించారు.