హైదరాబాద్ : మహిళలను, బాలికలను గౌరవించే సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్ గౌడ్ అన్నారు. మహిళ దినోత్సవ వారత్సవాల్లో భాగంగా ఎర్రమంజిల్ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యాలయంలో మహిళ పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి శివకుమార్ గౌడ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సేవ్ ద గర్ల్ చైల్డ్ సంస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
బాలికలను, మహిళలను గౌరవించే విధానాన్ని తల్లిదండ్రులే బాధ్యతగా తీసుకొని వారి పిల్లలకు నేర్పించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా శిఖడాలన్నారు. తమ సంస్థ నుంచి పేద విద్యార్థులకు విద్యాపరంగా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సేవ్ ద గర్ల్ చైల్డ్ మహిళా బృందం డా. స్రవంతి, గీతారెడ్డి, రాగి స్వప్న, డా. శ్రీవాణి, ప్రియాంక, రజిత, మౌనిక, సౌజన్య, సుభాషిణి, ముందడుగు ఫౌండేషన్ సభ్యులు కొన్నె దేవేందర్, కొమటి రమేష్‌బాబు, శివనాగరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.