బండ్లగూడ : నిరు పేదల సంక్షేమమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు.రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు స్థానికులు అనేక సమస్యలను వివరించారు.
వర్షం కురిస్తే వరద నీరు రావడంతో అనే ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమాన్ నగర్ బస్తీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
మంచినీటిని కూడ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ జగన్, ఈఈ నరేందర్‌గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మహేష్, శ్రవణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.