హైదరాబాద్: హైటెక్ సిటీలో విషాదం చోటుచేసుకున్నది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య (Software Engineer) చేసుకున్నారు. వంగ నవీన్ రెడ్డి (24) అనే యువకుడు మైండ్ స్పేస్ టవర్‌పై నుంచి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. అతడు ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మైండ్ స్పేస్ టవర్‌లో 13వ ఫోర్ నుంచి దూకాడని, తలకు తీవ్రగాయాలవడంతో చనిపోయాడని తెలిపారు. కాగా, అతని మృతికిగల కారణాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.