కొండాపూర్, మార్చి 29 : అడ్డదారిలో డబ్బలు సంపాదించాలని రెడ్ ఇయర్ (ఎరుపు రంగు చెవుల) తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ నర్లో నివసించే సయ్యద్ అష్రఫ్ కుమారుడు సయ్యద్ అవైజ్(25) సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్రమంగా, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడు తప్పుడు దారి తొక్కాడు. అందుకోసం సయ్యద్ అవైజ్ రెడ్ ఇయర్ తాబేళ్ల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు.
అవైజ్ అతడు తాబేళ్లను అమ్ముడుతన్నాడనే పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. సయ్యద్ అవైజ్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి నాలుగు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని చందానగర్ పోలీసుSలకు అప్పగించారు. అవైజ్పై తాబేళ్ల అక్రమ రవాణా, విక్రయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సయ్యద్ అవైజ్ నుంచి స్వాధీనం చేసుకున్న తాబేళ్లు
