Hyderabad | హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ నగ్నంగా ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు బీరప్ప గుడిలో నుంచి విగ్రహం, చీర ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల క్రితం జాబ్ మానేసి వైజాగ్‌లోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి ఫీర్జాదిగూడలోని శంకర్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో నిద్రలేచిన తేజస్విని.. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఫీర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో దారి మధ్యలో కనిపించిన బీరప్పగుడి వద్ద ఆగి మొక్కి.. అక్కడి నుంచి చీర, విగ్రహం తీసుకెళ్లడం గమనార్హం.
అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి
హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన
విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్లో ఉంటోంది
అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా… pic.twitter.com/LAwHuwWUPd
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 18, 2026
శనివారం ఉదయం నిద్రలేచిన తల్లి అరుణ.. గది బయట తాళం వేసి ఉండటం గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తెరిచారు. ఆ తర్వాత కుమార్తె కోసం వెతకగా.. ఎక్కడా కనిపించలదేు. దీంతో కంగారుపడి చుట్టుపక్కల గాలించగా.. ఫీర్జాదిగూడ చెరువులో నగ్నంగా శవమై కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, తన కూతురు కొద్దిరోజులుగా పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులకు అరుణ చెప్పింది. కాగా, యువతి నగ్నంగా వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.