e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home హైదరాబాద్‌ చేయీ చేయి కలిపి..మరో ప్రాణం నిలిపి..

చేయీ చేయి కలిపి..మరో ప్రాణం నిలిపి..

  • పొరుగు రాష్ర్టాలకూ మనోహర్‌,కూతురు సంజనా రహేజాల సేవలు
  • స్నేహితులు, బంధువులు, దాతల సహకారంతో శస్త్ర చికిత్స
  • సాయం అందించిన సోనూసూద్‌ ఫౌండేషన్‌, తదితరులు

చికిత్స విజయవంతమై కోలుకున్న బిహార్‌ బాధితుడు‘సాయం అందించండి.. చావు బతుకులతో పోరాడుతున్నాం’ అంటూ బిహార్‌ నుంచి వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌కు నగరానికి చెందినతండ్రీకూతురు స్పందించారు. చేతనైన సాయం చేయడంతో పాటు మరికొందరిని కూడగట్టి రూ.23లక్షలకు పైగా సమకూర్చారు. సదరు బాధితునికిఅపోలో వైద్యశాలలో కాలేయ మార్పిడి విజయవంతంగా చేయించారు. బాధితుడి ప్రాణాల్ని నిలబెట్టేందుకు ఎంతో మంది చేయూతనిచ్చారు. ఒక మనిషి ప్రాణాల్ని నిలబెట్టారు.

బేగంపేట్‌ జూలై 31: ‘తమ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది’ అని బిహార్‌ రాష్ట్రం నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ ఆర్తనాదం బోయినపల్లిలోని ఓ తండ్రీ కూతురును కదిలించాయి. బోయినపల్లికి చెందిన మనోజ్‌ రహేజా వ్యాపారి. ఆయన కుమార్తె సంజన రహేజా ఐటీ ప్రొఫెషనల్‌. కరోనా సెకండ్‌ వేవ్‌తో పేద, మధ్య తరగతి ప్రజలు బెడ్లు లేక, వైద్య సేవలు అందింక విలవిలలాడుతున్న తరుణంలో వీరు చలించి తమకు తోచిన దాంట్లో, దాతల సహకారంతో ఎంతోమందికి ఉచితంగా బెడ్లు, ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్స్‌, వెంటిలేటర్లు, సిలిండర్లు అందించారు. ప్లాస్మా అవసరం ఉన్న వారికి వెతికి ప్లాస్మా దానం కూడా చేయించారు. వీరు చేస్తున్న సేవలు ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరించాయి.

బిహార్‌- బగల్‌పూర్‌ నుంచి ఫోన్‌..

- Advertisement -

జూన్‌ 6వ తేదీన సంజనా రహేజాకు బిహార్‌ రాష్ట్రంలోని బగల్‌పూర్‌ నుంచి షాను కుమారి ఫోన్‌ చేసింది. తన తండ్రి జై ప్రకాశ్‌ షా(51)కు లివర్‌ పాడై పోయిందని కాలేయ మార్పిడి తప్పా, మరో మార్గం లేదని ఎలాగైనా సహాయం అందించాలని అభ్యర్థించింది. కాలేయ మార్పిడికి లక్షల్లో ఖర్చు అవుతుందని అంత స్థోమత తమకు లేదని, నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నామని విలపిస్తూ తెలిపింది. వెంటనే సంజనా ఈ విషయాన్ని తండ్రి మనోజ్‌ రహేజాకు తెలిపింది. ఇద్దరు కలిసి ఎలాగైనా బాధితుడికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించి ప్రాణాలు నిలబెట్టాలని అనుకున్నారు.

విమానంలో బిహార్‌ నుంచి నగరానికి..

బాధితులతో మాట్లాడి జూన్‌ 12వ తేదీన విమాన చార్జీలు చెల్లించి బిహార్‌ నుంచి హైదరాబాద్‌కు రప్పించారు. రహేజా స్నేహితుడు అనిల్‌ రాజా తన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ను వీరు బస చేసేందుకు ఉచితంగా అందించాడు. దాంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించాడు. అటుపై సోనూసూద్‌ ఫౌండేషన్‌తో మాట్లాడగా జూబ్లీహిల్స్‌లోని అపోలోకు వెళ్లాలని ఫౌండేషన్‌ వారు సూచించారు. అక్కడికి వెళ్లి డాక్టర్‌ మనీష్‌ శర్మను కలువగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ.23 లక్షలు అవుతుందని చెప్పారు. మనోజ్‌ రహేజా, సంజన రహేజాలు తమ బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల వద్ద శస్త్ర చికిత్స కోసం నగదును సేకరించారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ కూడా వీరికి కొంత ఆసరాగా నిలిచింది.

కుమారుడు జైషా కాలేయ దానం..

బాధితుడు జై ప్రకాశ్‌ షా కుమారుడు జైషా తన కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. సుమారు 25 రోజుల పాటు అన్ని రకాల పరీక్షలు తర్వాత జూలై 6వ తేదీన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను అపోలో ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 13న కాలేయ దాత జైషా పూర్తిగా కోలుకోని బయటకు వచ్చాడు. 14 రోజుల తర్వాత జై ప్రకాశ్‌ షా కూడా పూర్తిగా కోలుకున్నాడు.

స్నేహితుల సహకారంతో సక్సెస్‌ చేశాం

కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ.23 లక్షల ఖర్చు. ఆపరేషన్‌ తర్వాత ఏడాది వరకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు ఉంటుంది. ఇంత డబ్బు ఎలా? అని ఆలోచించాం. తమ వల్ల అవుతుందా? అని అనుకున్నాం. తన కుమార్తెతో మాట్లాడితే అవుతుంది.. చేద్దాం.. అని ముందుకు వచ్చి స్నేహితులు, బంధువుల వద్ద ఈ ప్రస్తావన తెచ్చారు. అనిల్‌ రాజ్‌, ఆష్మా కడాకియా, అగర్వాల్‌ పదం జైన్‌, డాక్టర్‌ రాజ్‌ కటారా, కల్యాణ్‌ చక్రవర్తిలతో పాటు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు చెందిన గోవింద్‌ అగర్వాల్‌ ఎంతో సహకరించారు. దీంతో శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఎంతో అనందంతో మురిసి పోయారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి భవిష్యత్‌లో తమ సహకారం అందించేందుకు కృషి చేస్తామని వారు వెల్లడించారు. మనోజ్‌ రహేజా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana