సిటీబ్యూరో: అలా సరదాగా కశ్మీర్‌కో.. ఊటీకో వెళ్లి కనువిందు చేస్తున్న మంచు పర్చుకున్న అందాలను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎవరైనా. కానీ ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే..సమయంతోపాటు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిందే. ఎందుకులే అంతదూరం వెళ్లడం అని ఆలోచిస్తున్నారా.. అయితే అటువంటి మంచును తలపించే విధంగా మన హైదరాబాద్‌లోనే స్నోవరల్డ్ రారమ్మని పర్యాటకులను పిలుస్తున్నది. అదెక్కడో కాదండి.. కొండాపూర్‌లోని మంచు సోయగంతో అల్లుకున్న ‘స్నో కింగ్డమ్’ అతిశీతలమైన మాయాజాలాన్ని అతి తక్కువ బడ్జెట్‌తోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇది దేశంలోనే అతిపెద్ద ఇండోర్ వినోద కేంద్రాలుగా చెన్సై, ముంబై నగరాలతో పాటు కొండాపూర్‌లోని ‘శరత్ సిటీ క్యాపిటల్ మాల్’ పర్యాటకులను అలరిస్తోంది. వింటర్ థ్రిల్‌గా మన హైదరాబాద్ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
ఇక్కడి ప్రత్యేకతలివే..
మంచుతో కప్పబడిన పర్వతాలు, ఓక్ చెట్లు, నిలబడి ఉన్న పెంగ్విన్లు, ఇగ్లూ ప్రదేశాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదరకమైన వాతావరణంలో అనుభవాన్ని, మంచుపై ఎంజాయ్ చేసేలా.. ‘స్నో మచ్ ఫన్’ ‘ఇది మీ చేతుల్లో ఉంది’ అనే పేటెంట్ క్యాచ్ ఫ్రెజ్లతో స్నో కింగ్డమ్ సందేశాలను పర్యాటకులకు తెలియజేస్తున్నారు.
రోజుకు 10 సెషన్లు నిర్వహిస్తూ..
పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.600 టికెట్ ధర చెల్లించి 45 నిమిషాల పాటు మంచులో ఆడుకోవడం, హిమపాతం అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా ఆడుకోవచ్చు. టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ ైక్లెంబింగ్, స్నో డ్యాన్స్, ఫ్లోర్లో డ్యాన్స్ వంచి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కాగా స్నో కింగ్డమ్ రోజుకు 10 సెషన్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.