సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): వివాహ స్వేచ్ఛపై ఆంక్షలు, దాడులు, పరువు పేరుతో కన్నబిడ్డల హత్యలు, లవ్ జీహాద్ రాజకీయాలు, కులమతాంతర వివాహాల ఆవశ్యకతపై సమగ్ర విశ్లేషణలతో కూడిన పుస్తకం స్కై బ్లూ జీన్స్ (నేటి వివాహ రాజకీయాలు) సీఎస్ సాగర్ రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాల్లో జరగనుంది.
సుధా కిరణ్ అధ్యక్షతన జరిగే ఈ సభలో పలువురు రచయిత, సీనియర్ జర్నలిస్టులు, కవులు, కళాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.