హైదరాబాద్ : ఘట్కేసర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్( Former MPTC Mahesh) హత్య కేసులో(Brutal murder) పోలీసులు ఆరుగురిని అరెస్ట్(Arrested) చేశారు. కాగా, మహేష్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య కేసులో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీంతో హత్యకేసులో అనుమనితులుగా ఉన్న వ్యక్తుల ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు. వందలాదిగా వచ్చిన వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వారం రోజుల తర్వాత కానీ డెడ్ బాడీ గుర్తించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన నిందితులను వదిలి మిగతా వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మాజీ ఎంపీటీసీ మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతడి సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఎన్ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.