మేడ్చల్/ మేడ్చల్ కలెక్టరేట్ అక్టోబర్ 28: రాష్ట్రంలో వార్ వన్ సైడే అని, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్‌కే పరిమితమని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 4 వార్డు పరిధిలోని ఆర్టీసీ కాలనీ, ప్రశాంత్‌నగర్, ఆర్‌ఎల్‌నగర్, ఓయూ కాలనీ, శ్రీనివాస్‌నగర్ తదితర కాలనీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు , వివిధ వర్గాల ప్రజలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున శనివారం బీఆర్ఎస్ చేశారు.
ఈ సందర్భంగా ఆయా కాలనీలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపిందన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సాగునీరుఅందించి, రైతుల కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీరుఅందజేసి ఆడబిడ్డల కష్టం తీర్చిండన్నారు.
ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆత్మగౌరవంగా బతికేలా చేశారన్నారు.యాదవులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తిదారులకు చేయూతనిచ్చి, ఉన్న ఊళ్లోను ఉపాధి చూపారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో మేనమామ లాగా పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టం పం చుకున్నాడన్నారు.
దళితులను సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు దళితబంధు అమలు చేశారని తెలిపారు. దేశంలో ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్ కంటే ముందు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఇంటింటికి ఎందుకు నీరు ఇవ్వలేదని, 24గంటల కరెంట్ ఇచ్చా రా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదని, ఇప్పుడు చేస్తామంటే ఎవరూ నమ్ముతారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించా రు.
సీఎం కేసీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.మున్సిపాలిటీలు బీఆర్ఎస్ హయాంలో ఎంతోఅభివృద్ధి చెందాయన్నారు.సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ నీరు, వరద ముంపు నివారణకు వరద కాల్వల నిర్మాణం తదితర ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి, హ్యాట్రిక్ సాధిస్తానన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను నచ్చి, ప్రతి రోజు వందల మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరితరం కాదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు.
ఆ తర్వాత జరిగే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటి, దేశంలో చక్రంతిప్పడం కూడా ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. ప్రశాంతనగర్ కాలనీకి బీజేపీ నేత సర్పరాజ్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు బీఆర్ఎస్లో చేశారు. అలాగే పలు కాలనీలకు చెందిన ప్రజలు దాదాపు 500 మంది మంత్రి సమక్షంలో చేశారు. అంతకుముందు మహిళలు మంత్రికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత జహంగీర్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, రాములు, పెంటయ్య గౌడ్, సాయినాథ్ గౌడ్, రమేశ్ గుప్తా, నర్సింహారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.