మైక్రో ఫైనాన్స్‌లో సింగర్ మంగ్లీ వాటాలు
మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి ప్రత్యేక్ష, పరోక్ష సంబంధాలున్నాయని న్యాయవాధి సుబ్బారావు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ, ఆమె సోదరుడు మీడియా ముందు అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసుకు కులం, మతం, ప్రాంతం అంటూ తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- నాకు ఏమైనా జరిగితే మంగ్లీనే కారణం
- న్యాయవాది సుబ్బారావు
ఖైరతాబాద్, మే 6 : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి ప్రత్యేక్ష, పరోక్ష సంబంధాలున్నాయని న్యాయవాధి సుబ్బారావు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ, ఆమె సోదరుడు మీడియా ముందు అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసుకు కులం, మతం, ప్రాంతం అంటూ తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు. మంగ్లీకి ఈ స్కామ్‌తో సంబంధం లేకుంటే ఇతరులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
నిందితులపై ఇప్పటికే గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. రమావత్ మధు తనకు తెలియదని మంగ్లీ అంటున్నారని, నోట్ల కట్టలు లెక్కపెడుతన్న వీడియోలు, మిర్చి తోటలో నిందితులతో ఫొటోలు, వీడియోలపై ఆమె వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంతో వచ్చిన డబ్బులతో మంగ్లీ, ఆమె సోదరుడు బినామీల పేరుతో భారీ ఆస్తులు కొనుగోలు చేశారని, ఇందులో ఆమె మేనేజర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటానని చెప్పిన మంగ్లీ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆమె తప్పు చేయనప్పుడు మేనేజర్‌తో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు.
ప్రెస్మీట్లకు సైతం రౌడీలను తీసుకొని వస్తున్నారని ఆరోపించారు. మంగ్లీ కేసు విషయంలో రాష్ట్ర కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిస్తే సానుకూలంగా స్పందించలేదన్నారు. ఈ కేసులో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరితే అందరికీ భద్రత కల్పించడం తమ పని కాదంటూ బాధ్యతారాహిత్యమైన సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకేమైనా జరిగితే దానికి మంగ్లీ, డీజీపీలే కారణమన్నారు. వందల కోట్ల కుంభకోణం జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మంగ్లీతో ఇప్పటికైనా చర్చకు సిద్ధమని, బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తే తాను కేసు వాపసు తీసుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం సీఎంను కలిసి వివరాలు అందిస్తానని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

