అమీర్‌పేట్, జూన్ 10: ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించే సిగ్నేచర్ ఫ్యాషన్, లైఫ్ ైస్టెల్ ఎగ్జిబిషన్, ‘ైస్టెల్ తత్వ’ 5వ ఎడిషన్ జూన్ 13, 14 తేదీల్లో హైటెక్స్‌లోని హాల్-2లో జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం బేగంపేట్‌లోని హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎఫ్ఎల్వో హైదరాబాద్ అధ్యక్షురాలు ప్రతిభా కుందా వివరించారు. ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా 205 ప్రదర్శకులు పాల్గొంటున్నారన్నారు.
ఫ్యాషన్, డెకర్, హ్యాండ్లూమ్, ఆభరణాలు, హోమ్ లివింగ్, కళాత్మక ఉత్పత్తులు లాంటి విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. 10 వేల మందికి పైగా సందర్శకులు ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని, గౌరవ అతిథిగా ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పూనమ్ శర్మ, ప్రముఖ సెలబ్రిటీ డ్రేపింగ్ ఆర్టిస్ట్ డాలీ జైన్ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మిస్ ఇండియా 2023, మిస్ వరల్డ్ టాప్-20 ఫైనలిస్ట్ నందిని గుప్తా మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లా, ఇది కూడా బ్రెయిన్‌తో కూడిన బ్యూటీ ప్రదర్శన. మహిళలు నిర్వహించే ఉద్దేశంతో కూడిన ఈ ప్రదర్శన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ైస్టెల్ తత్వ మెంటార్లు, ఎఫ్ఎల్వో మాజీ చైర్పర్సన్లు సీఏ సుభద్ర మహేశ్వరి, రీతు షా, ైస్టెల్ తత్వ ఎగ్జిబిషన్ కన్వీనర్ సీతారెడ్డి, కోకన్వీనర్లు రీతు అగర్వాల్, పూజా జైన్ తదితరులు పాల్గొన్నారు.