T-NAB | టీన్యాబ్ పటిష్ట నిఘాతో వెలుగులోకి ఎస్సై డ్రగ్స్ దందా..
రాష్ట్రంలో డ్రగ్స్ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు.
T-NAB | రాష్ట్రంలో డ్రగ్స్ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి డ్రగ్స్ రాకుండా కట్టడి చేయడంతో పాటు స్థానికంగా డ్రగ్స్ విక్రయాలు చేసే వారిపై, వినియోగించే వారిపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర వద్ద డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన టీన్యాబ్.. అరెస్టు చేసింది. ఆరు నెలల కిందట సైబర్‌క్రైమ్ కేసులో ముంబైకి వెళ్లి నైజీరియన్లను అరెస్ట్ చేసిన సమయంలో ఎవరికీ తెలియకుండా 1750 ఎండీఎంఏ డ్రగ్‌ను ఎస్ఐ దాచిపెట్టిన ఇంటికి తెచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటీవల తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన వద్ద డ్రగ్స్ ఉన్నదని.. కొనుగోలు చేసే వారుంటే చెప్పాలంటూ పలువురికి చెప్పాడు. ఇటీవల టీన్యాబ్ టీమ్‌లు డ్రగ్ విక్రయాలపై కూడా నిఘాను పెంచడంతో ఈ విషయం వారి దృష్టికి వచ్చింది. దీంతో టీన్యాబ్ తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఫలానా చోట డ్రగ్ ఉన్నట్లు గుర్తించి, ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే అది ఎస్సై ఇల్లు అని తెలిసింది.
ఎక్కడున్నా గుర్తిస్తారు..!
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం టీన్యాబ్ను ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా హైదరాబాద్ పోలీసులు హెచ్న్యూతో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. టీన్యాబ్ ఏర్పాటైన తరువాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గోవా, ముంబై, బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్ సరఫరాను కట్టడి చేస్తూ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్ వస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. డిమాండ్, సైప్లె నెట్‌వర్క్‌ను గుర్తిస్తున్నారు. అమ్మకం దారులతో పాటు వినియోగదారులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్ పెడ్లర్స్ తెలంగాణ వైపు చూడాలంటే భయపడుతున్నారు. ఒకపక్క ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే డ్రగ్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తూ, మరో పక్క స్థానికంగా డ్రగ్ వాడే వారిని గుర్తిస్తూ మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

