State Art Gallery | కొండాపూర్, ఏప్రిల్ 12 : హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాయజ్ఞ, టార్చ్ల కలయికతో శనివారం ”శిలా నిశ్శబ్దం” పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.
అనంతరం జై భారత్ సెక్రెటరీ కేవీ రమణమూర్తి, రౌనక్ యార్ ఖాన్, అరవింద్ ఆర్యలతో కలిసి ప్రదర్శనలోని చిత్రాలను తిలకించారు. ప్రదర్శనలు వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది చిత్రకారులు రామప్ప, కాకతీయ కాలంనాటి చిత్ర సంపదను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు 60 చిత్రాలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ చిత్ర ప్రదర్శన కొనసాగనుంది.