ఎస్‌హెచ్‌జీలకు రుణపరిమితి పెంపు
సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు
కందుకూరు, ఏప్రిల్ 26: మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభత్వం చర్యలు తీసుకుంటున్నది.సంఘాల వారీగా కాకుండా వ్యక్తి గతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతో పాటు స్వల్పకాలిక వడ్డీతో కూడిన రుణాలను అందిస్తున్నది.అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పలు ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రుణపరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏడాదికి గరిష్టంగా రూ.20లక్షల మేర మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.మండలంలో 1360 స్వయంసహాయక సంఘా లు ఉండగా 50 సంఘాలకు పైగా రూ.20లక్షల రుణంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.మిగతా సంఘాలకు రూ.10లక్షలు, రూ.5లక్షలమేర రుణాలను మంజూరు చేస్తారు. ఇందుకు బ్యాంకర్లు కూడా ముందుకొచ్చారు.అయితే ఎస్‌హెచ్‌జీ సభ్యులు అధికంగా కిరాణాషాపులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయలవ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు.గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లికేజీ, స్త్రీనిధి లక్ష్యానికి అనుగుణంగా రుణాలను మంజూరు చేశారు. అదే విధంగా ఎప్పటిక ప్పుడు రుణాలను చెల్లించి తిరిగి పొందుతున్న స్వయం సహాయక సంఘాలకు అధికారులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.
ఒక్కో సంఘానికి రూ.20లక్షలు
మండలంలో1360 సంఘాలు ఉన్నాయి. అందులో 50సంఘాలకు రూ.20లక్షల చొప్పున రుణాలను అందజేస్తాం. బ్యాంక్ లింకేజీ రూ.45కోట్లు, మిగతా సంఘాలకు రూ.10లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇస్తాం. మహిళలు ఆర్థికంగా ఎదుగాలని ప్రభుత్వం రుణాల పెంపు పరిమితి పెంచింది. ఇది మంచి అవకాశం. -కవిత ఏపీఎం కందుకూరు.